రాష్ట్రంలో కాస్త త‌గ్గిన క‌రోనా వ్యాప్తి.. నేడు 3,606 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా ఉధృతి త‌గ్గ‌డం లేదు. ప్ర‌తి రోజు వేల సంఖ్య‌లో కేసులు వెలుగు చుస్తున్నాయి. తాజా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3606 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. కాగ ఈ సంఖ్య గ‌త రెండు, మూడు రోజుల నుంచి పోలిస్తే.. కొంత వ‌ర‌కు త‌క్క‌వ‌నే. కానీ రాష్ట్రంలో క‌రోనా ఉధృతి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించిన క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. ఒక్క రోజే 3,606 క‌రోనా కేసులు వెలుగు చూశాయి.

కాగ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 93,397 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అంతే కాకుండా ఈ రోజు రాష్ట్రంలో క‌రోనా కాటుకు ఒక్క‌రు బ‌లైయ్యారు. కాగ ఈ రోజు మ‌ర‌ణాలు కూడా త‌గ్గాయి. ప్ర‌తి రోజు రెండు నుంచి మూడు మ‌ర‌ణాలు సంభ‌వించేవి. కానీ నేడు ఒక్క మ‌ర‌ణం సంభ‌వించింది. కాగ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,707 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 32,094 యాక్టివ్ కేసులు ఉన్నాయి.