టీఆర్ఎస్ఎల్పీ భేటీ దృష్ట్యా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

-

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ జారీ చేశారు. బంజారాహిల్స్ వంటి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఉన్నందున ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. ఈ భేటీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఇతర రాష్ట్రాల నేతలు, రాష్ట్ర ప్రజాప్రతినిధులు హాజరవుతుండటంతో.. ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్‌ పోలీసు సంయుక్త కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు.

బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 12 మీదుగా వాహనదారుల రాకపోకలు నిలిపివేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు. ఎన్​టీఆర్​ భవన్‌, అపోలో ఆసుపత్రి, ఫిలింనగర్‌ నుంచి వచ్చే వాహనాలను.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45, 36 మీదుగా మళ్లించనున్నారు. మాసబ్‌ట్యాంక్‌ నుంచి రోడ్‌ నెంబర్‌ 12 వైపు వచ్చే వాహనాలను.. రోడ్‌ నెంబర్‌ 1,10 మీదుగా జహీర్‌నగర్‌ నుంచి ఎన్టీఆర్​ భవన్​ మీదగా మళ్లిస్తారు.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని సంయుక్త సీపీ పేర్కొన్నారు. వాహనదారులు ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని సంయుక్త సీపీ రంగనాథ్​ విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news