నేడు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశం

నేడు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంకు 283 మంది ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. సమావేశంలో టిఆర్ఎస్ పేరు మార్పు కోసం తీర్మానంకై … ప్రతినిధులు సంతకాల సేకరణ జరుగుతుంది. ఒంటి గంటకు మీడియా ముందుకు సీఎం కేసీఆర్ రానున్నారు. 1: 19 నిముషాలకు టిఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై ప్రకటన… కొత్త పేరుని ప్రకటించనున్నారు.

ఆ తర్వాత ప్రతినిధులతో కలసి ప్రగతి భవన్ లో అక్కడే లంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రాకను స్వాగతించనున్నారు కుమారస్వామి. గురువారం కేంద్ర ఎన్నికల సంఘంను కలవనున్నారు బోయినిపల్లి వినోద్ నేతృత్వంలోని టిఆర్ఎస్ ప్రతినిధులు బృందం. టిఆర్ఎస్ పేరు మార్పు కోరుతూ అవసరమైన పత్రాలు అందించనున్నారు.