బండి సంజయ్ తిరుగుబోతు… అరవింద్ వాగుబోతు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

బీజేపీ పార్టీ బుద్ది, జ్ఞానం లేని పార్టీగా తయారైందని.. రైతులకు వ్యతిరేఖంగా మారి, కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి ముందు అన్నదాతలు వడ్లపోశారని… అన్నంపెట్టే వారికి సున్నం పెడితే ఇలాగే జరుగుతుందని ఆయన అన్నారు. వడ్లు కొనండి అంటే బీజేపీ నేతలు బెదిరస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ తిరుగుబోతు, ఆంబోతుగా ప్రవర్తిస్తున్నారని… నిజామాబాద్ ఎంపీ అరవింద్ వాగుబోతుగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వరికి గోధుమకు తేడా తెలియదని, క్వింటాల్ కు కిలోకు తేడా తేలియదని… బీజేపీ నేతల్ని విమర్శించారు. jeevan reddy

తెలంగాణలో గోధుమలు ఎక్కడ ఉన్నాయని బీజేపీ నేతల్ని విమర్శించారు. గత చరిత్రలో ఇంత దరిద్రమైన కేంద్ర ప్రభుత్వం ఎక్కడా లేదని అన్నారు. వాట్సాప్ యూనివర్సిటీలో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రైతులతో పెట్టుకున్నవారు కేసీఆర్ తో గోక్కున్నవారు ఎవ్వడూ మిగలలేదని జీవన్ రెడ్డి హెచ్చరించారు. దేశంలో బీజేపీ పార్టీకి టూలెట్ బోర్డ్ పెడుతారని అన్నారు. రైతులను నూకలు తినమన్న వాడి పీక ఎలా పిసకాలో మా రైతులకు తెలుసు అని అన్నారు. రైతులు బీజేపీ నేతలపై దంగల్ ప్రకటించారని అన్నారు.