సీఎం కేసీఆర్‌ ఓ సూపర్‌ స్టార్‌..ఏం చేసిన చరిత్రే : జీవన్‌ రెడ్డి

-

సీఎం కేసీఆర్‌ ఓ సూపర్‌ స్టార్‌..ఏం చేసిన చరిత్రే అని..టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అంటే కొలువులు, చదువులు, రూపాలు అని.. తెలంగాణ రాదని చెప్పారు కానీ తీసుకొచ్చింది కేసీఆర్ అని వెల్లడించారు. కాళేశ్వరం కట్టలేరు అన్నారు కానీ కేసీఆర్ కట్టి చూపించారని… లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కేసీఆర్ ఇచ్చారని చెప్పారు.

ప్రతి పక్షాలు చిన్న మెదడు చితికి పోయిందని… కేసీఆర్ అంటే ఒక చరిత్ర..కేసీఆర్ ఒక సూపర్ స్టార్ అన్నారు. రేవంత్ రెడ్డి మెదడు దొబ్బిందని… కేసీఆర్ టీఆర్ఎస్ మోసపూరిత పార్టీ అంటున్నాడని రేవంత్ పై నిప్పులు చెరిగారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వారిని నమ్మి నిరుద్యోగులు మోసపోకండి..నేను ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. చక్కగా చదువుకోవాలని… కాంగ్రెస్, బీజేపీ అనుబంధ సంస్ధల నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయి జాబులు తెచ్చుకోవాలని వెల్లడించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. టీఆర్‌ఎస్‌ తోనే అభివృద్ధి అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news