బ్రేకింగ్ : టీఆరెఎస్ ఎమ్మెల్యే నోముల మృతి

Join Our Community
follow manalokam on social media

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీకి చెందిన నోముల నర్సింహయ్య మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింహయ్య అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1999,2004 లో సీపీఎం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నోముల ఆ తరువాత 2009 భువనగిరి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

2014 లో టీఆర్ఎస్ లో చేరిన నోముల 2014లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2018 ఎన్నికల్లో జానారెడ్డిపై ఘన విజయం సాధించిన నోముల నర్సింహయ్య అప్పటి నుండి ఆయన యాక్టివ్ గానే ఉన్నారు. సుదీర్ఘకాలం వామపక్ష ఉద్యమాల్లో పనిచేసిన నోముల రాష్ట్రం వచ్చాకనే టీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు.  హైదర్ గూడ అపోలోలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్టు చెబుతున్నారు.

TOP STORIES

బన్నీ చేస్తున్న సాహసం మామూలుది కాదు..

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై ముందునుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయి. వీరిద్దై కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో మరీ ఎక్కువగా ఉన్నాయి....