టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం..సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు

-

టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కేసు తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా కేసులోని ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తమ అరెస్టు అక్రమమని పేర్కొన్నారు. పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరపనుంది.

కాగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఏర కేసులో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పట్టుబడిన నిందితుల రిమాండ్ కు అనుమతినిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ముగ్గురు నిందితులు సైబరాబాద్ సీపీ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. నిందితులకు 41 ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్ కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు రోజుల పాటు వాదనలు విన్న హైకోర్టు నిందితుల రిమాండ్ కు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. వారిని అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరచాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news