గవర్నర్‌పై పిటిషన్‌ను వెంటనే విచారించండి.. సుప్రీంకు ప్రభుత్వం విజ్ఞప్తి

-

గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్​ల మధ్య చిన్నపాటి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా కాలంగా గవర్నర్ వద్ద కొన్ని బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. ఈ బిల్లులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఆమోదిస్తానని గతంలోనే గవర్నర్ స్పష్టం చేశారు.

ఈ క్రమంలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పెండింగ్‌లో ఉంచారని ఇటీవలే సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే గవర్నర్​కు వ్యతిరేకంగా వేసిన పిటషన్​ను వెంటనే విచారించాలని ఇవాళ సర్వోన్నత న్యాయస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ విషయాన్ని సీజేఐ ధర్మాసనం ఎదుట తెలంగాణ సర్కార్ తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ముఖ్యమైన బిల్లులను గవర్నర్‌ తమిళిసై… 6 నెలలుగా పెండింగ్‌లో ఉంచారని దుష్యంత్‌ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో పంజాబ్‌ కేసులో సుప్రీం జోక్యం చేసుకుందని దవే గుర్తు చేశారు. ప్రజాపయోగమైన 10 బిల్లుల్ని గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ఈనెల 27న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news