ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు హైకోర్టు అనుమతి నిరాకరణ

-

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారంపై హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. ఈనెల 28న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మం లకారం చెరువులో.. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై భారత యాదవ సమితి, తదితర పిటిషన్లపై.. ఈనెల 18న విచారణ జరిపిన హైకోర్టు..  స్టే ఇచ్చింది.

పిటిషన్‌లో ఇంప్లీడ్ అయిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా-తానా… స్టే ఎత్తివేయాలని కోరింది. విగ్రహం ఏర్పాటుకు  ప్రభుత్వం అనుమతి కూడా తీసుకున్నామని తెలిపింది. ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ నాయకుల విగ్రహాల ఏర్పాటుకు సర్కారు అనుమతి ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదించారు.

ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే అభ్యంతరం లేదని.. అయితే శ్రీకృష్ణుడి రూపం ఇవ్వడం హిందువులు, యాదవుల మనోభావాలు దెబ్బతీయడమేనని వాదించారు. వాదనలు విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ ప్రభుత్వ అనుమతి ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్లు వేయాలని ఆదేశిస్తూ విచారణ జూన్ 6కి వాయిదా వేశారు

Read more RELATED
Recommended to you

Latest news