టీఎస్ ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్.. టీ24 టికెట్ పై 20 శాతం డిస్కాంట్

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. హైద‌రాబాద్ లోని ఎన్డీఆర్ గ్రౌండ్స్ లో జ‌రుగుత‌న్న జాతీయ పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుత‌న్న విష‌యం తెలిసిందే. ఈ బుక్ ఫెయిర్ కి ఎక్కువ మంది వ‌చ్చేలా టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. బుక్ ఫెయిర్ ఈ నెల 27 వ‌ర‌కు ఉంటుంది కాబ‌ట్టి అప్ప‌టి వ‌ర‌కు రూ. 100 టికెట్ పై 20 శాతం రాయితీ ఇస్తామ‌ని టీఎస్ ఆర్టీసీ ప్ర‌క‌టించింది. బుక్ ఫెయిర్ ని సంద‌ర్శించి విజ్ఞానాన్ని పెంచుకోవాల‌నే ఉద్దేశం తోనే టికెట్ పై డిస్కాంట్ ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది.

అంద‌రూ కూడా ఈ ఆఫ‌ర్ వినియోగించు కోవాల‌ని సూచించింది. కాగ హైద‌రాబాద్ న‌గ‌రంలో రూ. 100 గ‌ల‌ టీ 24 అనే టికెట్ ద్వారా 24 గంట‌ల పాటు న‌గ‌రం మొత్తం అన్ని బ‌స్సు ల‌లో ప్ర‌యాణించ వ‌చ్చు. అయితే టీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణ‌యం తో ఇప్పుడు టీ 24 అనే టికెట్ ధ‌ర రూ. 80 వ‌ర‌కే ల‌భిస్తుంది. ఈ బంప‌ర్ ఆఫ‌ర్ ఈ నెల 27 వ‌ర‌కు అందుబాటు లో ఉంటుంది. కాగ హైద‌రాబాద్ లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో హైద‌రాబాద్ బుక్ ఫెయిర్ ఈ నెల 18 నుంచి ప్రారంభం అయింది. ఈ బుక్ ఫెయిర్ లో ఎన్నో పుస్త‌కాలు ల‌భిస్తాయి.