టీఆర్ఎస్ నేతలే కాదు.. బీజేపీ నేతలు కూడా ఢిల్లీ బాట పట్టారు. రేపు అమిత్ షాతో బీజేపీ నేతలు కీలక భేటీ కానున్నారు. అయితే గతంలోనే అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ జరగాల్సి ఉన్నా.. ఆ సమయంలో సీడీఎస్ బిపిన్ రావత్ మరణించడంతో ఇది వాయిదా పడింది. తాజాగా రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.
ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు ఢిల్లీకి పయణమయ్యారు. బీజేపీ నేత డీకే అరుణతోపాటు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి బయలుదేారారు. రేపు అమిత్ షాతో విడివిడిగా బీజేపీ నేతలు సమావేశం అవుతారని తెలుస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వడ్ల కొనుగోలు అంశాలను అమిత్ షా ద్రుష్టికి తీసుకెళ్లనున్నారు. ఇదే విధంగా ఎన్నికలకు మరో ఏడాదిన్నరే గడువు ఉండటంతో తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతానికి అమిత్ షా దిశా నిర్థేశం చేయనున్నారు. అధికార టీఆర్ఎస్ పై ఎలా పోరాడాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది.