తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ఆర్టీసీ సంస్థ. తెలంగాణలో తొలిసారిగా పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులను TSRTC అందుబాటులోకి తీసుకు వచ్చింది.

అత్యాధునిక హంగులతో కూడిన ఈ బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇక పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సుల ఫోటోలు వైరల్ గా మారాయి.