TGSRTCగా మారనున్న TSRTC!

-

TSRTC to become TGSRTC:  తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్‌ ‘టీజీ కోడ్‌తో మొదలు అయింది. కొత్త వాహనాల నంబర్‌ ప్లేట్లపై టీఎస్ బదులు ‘టీజీ’ కోడ్‌ వస్తోంది. జిల్లాల నంబరు కోడ్‌లు పాతవే కొనసాగుతాయని ప్రభుత్వ స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ తరుణంలోనే.. తెలంగాణ ఆర్టీసీ సంస్థలో కూడా కీలక మార్పులు జరుగనున్నాయి.

TSRTC to become TGSRTC

ఆర్టీసీ బస్సులను ఇకనుంచి TG సిరీస్ తో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. సంస్థ పేరును సైతం TSRTC నుంచి TGSRTCగా మార్చాలని నిర్ణయించారు. త్వరలో సంస్థ లోగోలోను మార్పులు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో TG అమలుకు కేంద్రం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వగా, అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో TSని TGతో రీప్లేస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news