హైదరాబాద్ లో కొట్టుకు వచ్చిన రెండు మృతదేహాలు

-

బేగంపేటలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షానికి ఓల్డ్ కస్టమ్స్ బస్తి నాళాల్లో కొట్టుకు వచ్చాయి రెండు మృత దేహాలు. ఈ సంఘటన బేగంపేట ఏరియాలో జరిగింది. ఆ ఇద్దరు నాళాలో పడి మరణించినట్లు సమాచారం.

Two dead bodies found in Hyderabad

కాగా నడి వేసవిలో హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు రికార్డు స్థాయిలో వాన పడింది. ఈదురు గాలులతో కూడిన వర్షం భాగ్యనగరంలో బీభత్సం సృష్టించింది. రికార్డుస్థాయి వ‌ర్షానికి నగరంలోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. ఇక రహదారులపైకి నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా చోట్లు చెట్లు విరగడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, విద్యుత్ వైర్లు తెగడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news