తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు అంతర్జాతీయ కంపెనీలు రానున్నాయి. తెలంగాణలో తమ పరిశోధన అభివృద్ధి, డిజి టెక్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నాయి ఫిస్కర్, కాల్ వే సంస్థలు. అమెరికాలో 2 కంపెనీల ప్రతినిధులతో మంత్రి కే. తారక రామారావు నిన్న సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మొబిలిటీ క్లస్టర్ లో భాగస్వాములయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది ఫిస్కర్. మంత్రి కే. తారకరామారావుతో జరిగిన సమావేశాల అనంతరం రెండు కంపెనీల పెట్టుబడి ప్రకటనలు చేశాయి.
అమెరికా తర్వాత క్వాల్కమ్ కంపెనీకి రెండో అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్ లో అక్టోబర్ లో ప్రారంభం కానున్నాయి. రూ. 3904.55 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కేంద్రం త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉందని సంస్థ పేర్కొంది. ఈ క్యాంపస్ ఏర్పాటు తర్వాత 8700 నుంచి 10 వేల మంది టెక్ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి.
అగ్రిటెక్, విద్యారంగం, కనెక్టెడ్ డివైస్ ల వినియోగం, స్మార్ట్ సిటీ కార్యక్రమాల్లో భాగం కావడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపిన క్వాల్కమ్.. మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో తన పెట్టుబడి ప్రణాళికలను పంచుకుంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరొక ప్రముఖ కంపెనీ అయిన ఫిస్కర్, హైదరాబాద్ లో ఐటి, డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నాయి.