రేపు తెలంగాణ కేంద్ర హోం మంత్రి అమిత్ షా..షెడ్యూల్ ఇదే

రేపు తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ను విడుదల చేసింది. రేపు మధ్యాహ్నం 2.30 కు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. ఆ తరువాత 3 గంటలకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ ని సందర్శించనున్నారు అమిత్ షా.

4.30 గంటల వరకు అక్కడే ఉండనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా… 5 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని నోవా టెల్ హోటల్ కి వెళ్లనున్నారు. ఇక సాయంత్రం 6.30 గంటలకు తుక్కుగుడా సభాస్థలికి రానున్నారు అమిత్ షా. ఈ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై కీలక ప్రకటన చేసే ఛాన్స్‌ ఉంది. ఇక రేపు రాత్రి 8 గంటలకు సభ నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్లనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. 8.25 కి తిరిగి ఢిల్లీ ప్రయాణం కానున్నారు అమిత్‌ షా.