తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ లలో రోజాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మొదటిగా సర్పయాగం చిత్రంతో హీరోయిన్ గా అడుగుపెట్టింది రోజా . ఆ తర్వాత డైరెక్టర్ ఈ.వీ.వీ.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సీతారత్నం గారి అబ్బాయి వంటి చిత్రంతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈవీవీ. సత్యనారాయణ ఎవరో కాదు అల్లరి నరేష్ తండ్రి. ఇక ఆ తర్వాత రోజా తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో టాప్ హీరోయిన్ గా రాణించింది. ప్రస్తుతం ఇటు బుల్లి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మొదటగా మాటీవీలో మోడ్రన్ మహాలక్ష్మి షో తో ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఆ తర్వాత జబర్దస్త్ ప్రోగ్రాం తో ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే అల్లరి నరేష్ కు రోజా కు మధ్య ఉన్న రిలేషన్ ఏమిటంటే జబర్దస్త్ షో ద్వారా మళ్లీ ప్రేక్షకులకు దగ్గరైన రోజా సెలబ్రిటీల విషయంలో కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలలో మాత్రమే నటిస్తూ ఉన్న అల్లరి నరేష్ గత సంవత్సరం నాంది చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ సమయంలోనే జబర్దస్త్ కి సినిమా ప్రచారం కోసం వచ్చిన డైరెక్టర్ విజయ్ కనుకమేడ లతో వచ్చిన అల్లరి నరేష్ జబర్దస్త్ జడ్జ్ గా ఉన్న రోజాతో డాన్స్ వేయడం జరిగింది.
అయితే హీరోగా రోజా తో కలిసి ఒక సినిమాని చేయాలని ఉందని తెలియజేశాడు. రోజా కూడా సీతారత్నం గారి అబ్బాయి చిత్రం షూటింగ్లో అల్లరి నరేష్ చాలా చిన్న పిల్లవాడు.. అప్పుడు బాగా ఎత్తుకొని ఆడించే దాన్ని అని తెలియజేశారు. మొట్టమొదటిగా రోజాకి కెరియర్ పరంగా ఇచ్చింది ఇ.వి.వి.సత్యనారాయణ కావున వీరిద్దరి మధ్య స్నేహబంధం బాగా ఉన్నది. అందుచేతనే అప్పటినుంచి ఆ ఫ్యామిలీ అంటే రోజాకు చాలా ఇష్టమట.