hanumantharao: కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని అన్నందుకు భట్టి నాపై పగబట్టిండని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హన్మంతరావు. మల్లు రవికి నేను టికెట్ ఇప్పిస్తే భట్టి నా కాళ్లు మొక్కిండన్నారు.
నేను భట్టి విక్రమార్కను రాజకీయాల్లోకి తీసుకొచ్చాను.. ఇప్పుడు భట్టి విక్రమార్కకు ఆ కృతజ్ఞత లేదని మండిపడ్డారు. ఖమ్మం టికెట్ నాకు రాకుండా కుట్ర చేస్తున్నారని సీరియస్ అయ్యారు. భట్టిపై నేను ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హన్మంతరావు.