జగన్ పై రాయి దాడి జరుగడంపై…ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి అమానుషమని మండిపడ్డారు.జగన్ కు రాయి తగలడం టీవీలో లైవ్ చూసానని తెలిపారు. ముందు రాయి అనుకోలేదని…రాయి గట్టిగానే తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై కూడా రాళ్లు వేశారు కానీ వాళ్లకు తాగలేదంటూ ఎద్దేవా చేశారు.
45 ఎస్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందో మార్గదర్శి తెలుసు తెలుసుకోవాలి…45 ఎస్ విషయంలో తెలంగాణ హైకోర్టు పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కేసు విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాలనుకున్నది పూర్తిస్థాయిలో చెప్పి హై కోర్టుకు సహకరించాలని సుప్రీం ఆదేశించింది..2007లో చెల్లించాల్సిన చెల్లింపులను 2009లో చెల్లించారు.
దీనికి సంబంధించిన వడ్డీ పూర్తిస్థాయిలో చెల్లించారో లేదో పరిశీలించాల్సి ఉందని తెలిపారు. రంగాచారి కమిషన్ పై రామోజీరావు కోర్టుకు వెళ్లారు…మార్గదర్శి ఫైనాన్షియర్స్ కు సంబంధించి విచారణ అధికారిగా కృష్ణంరాజు ఉన్నప్పుడు 300 బాక్సులు డాక్యుమెంట్స్ రూపొందించారని వెల్లడించారు. వీటన్నింటిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుందన్నారు.