నా కొడుకుపై టీఆర్‌ఎస్‌ నేతలే కుట్రలు చేశారు..వారి భరతం పడతా : వనమా

నా కొడుకు టీఆర్‌ఎస్‌ నేతలే కుట్రలు చేశారు..వారి భరతం పడతానని వార్నింగ్‌ ఇచ్చారు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు. తాను రెండు నెలలు అనారోగ్యంతో బాధ పడ్డానని.. తాను లేని సమయంలో నా కుమారుడు రాఘవ పై కుట్రలు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఅర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కావలసిన వాడు..రాఘవ రాజకీయ భవిష్యత్ ఆగం చేశారని మండిపడ్డారు.

నేను అనారోగ్యం తో లేకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. కొత్తగూడెం నియోజకవర్గ వర్గంలో నిత్యం పర్యటిస్తున్నానని… నా కుమరుని పై కుట్రలు చేసిన వారి బండారం బయట పెడుతానని హెచ్చరించారు. తమ పార్టీ వాళ్ళతో పాటూ ఇతర పార్టీల వారు కుమ్ముక్కు అయ్యారని.. తన కుమారుడిపై కుట్రలు చేసిన వారి సంగతి తేలుస్తానని వార్నింగ్‌ ఇచ్చారు. రాజకీయ కుట్రలు చూసి రాఘవపై ప్రజల్లో సింపతి పెరిగిందన్నారు. రాఘవపై పెట్టిన కేసు నిలువదని వెల్లడించారు వనమ వెంకటేశ్వరరావు.