22 కార్లు కొని…100 కోట్లు కేసీఆర్ దుర్వినియోగం చేసాడు – రాములమ్మ

-

కేసీఆర్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. “బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ” అని నాడు తెలంగాణ ల మారుమోగిన గీతం, ఇయ్యాల “బండెనక బండి కొని బాయీసు(22) బండ్లు కొని ఏ బండిలెల్లదమని దొరగారు”…. అన్న తీరుగా తిరిగి అడగవలసి వచ్చింది, ఈ 22 కార్ల కొనుగోలు కై కేసీఆర్ గారు సుమారు 100 కోట్ల రూపాయల ప్రజాధన దుర్వినియోగం చేసాడని నిప్పులు చెరిగారు విజయశాంతి.

vijayashanthi on ts assembly elections
vijayashanthi on ts assembly elections

అయితే దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది విన్నంక. లక్షల కోట్ల అవినీతి, ప్రాజెక్టులు, ధరణి కుంభకోణాలు , ఇసుక మాఫియా దోపిడికి సమాధానం ఇప్పటికీ లేదు, ఈ కార్లు కొని దాచిపెట్డుడు ఇంకో సిగ్గుపడాల్సిన అంశం అంటూ చురకలు అంటించారు. దండుపాళ్యం దోపిడి బ్యాచ్ లెక్క , దొరలు అందిన అన్నింటా దోచుకుని, ఇప్పుడు చప్పుడు చెయ్యం సమాధానం చెప్పం అంటే నడవదని హెచ్చరించారు. మీరు జనం ముందుకెళ్లాలంటే , సమాధానం చెప్పి వెళ్లాలి, అప్పటిదాకా ఎన్నిసార్లైనా అడుగుతనే ఉంటామని వార్నింగ్ ఇచ్చారు విజయశాంతి. మల్లా మల్లా అడుగుతూనే ఉంటామన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news