బిజెపి నేత విజయశాంతి ఈ మధ్యకాలంలో దూకుడును పెంచారు. మీడియా వేదికగా మాట్లాడకుండా సోషల్ మీడియా వేదికగా వరుసగా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పిలుపునిచ్చారు విజయశాంతి. బీఆర్ఎస్ కాకుండా వేరే ప్రభుత్వం వస్తే తిరిగి ఉద్యమాలు చేయడం తప్పదని కేసీఆర్ గారు చెప్పడం విచిత్ర వాదం అని మండిపడ్డారు.
నిజానికి రానున్న 40 రోజులు ఈ అవినీతి, అక్రమ, దుర్మార్గ, దోపిడి, వేధింపుల కేసీఆర్ గారి సర్కార్ ను ఎల్లగొట్టానీకి తెలంగాణ ఉద్యమ స్పూర్తితో సకలజనులం తిరిగి అదే పోరుబాట పట్టకుంటే, ఈ నియంత్రత్వ కేసిఆర్ గారు, వారి మంత్రులు, ఎమ్మెల్యేలు తిరిగి 5 సంవత్సరాలు మన తెలంగాణ ప్రజలను ఇంతకు 10 రెట్లు ఎక్కువ వేధించే పరిస్థితి తప్పదని పేర్కొన్నారు విజయశాంతి. కాగా విజయశాంతి సీఎం కేసీఆర్ పై కామారెడ్డి లో పోటీ చేస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ విజయశాంతి కామారెడ్డి తో పాటు మెదక్ బరిలో కూడా ఉంటారని సమాచారం అందుతుంది. ఒకటి రెండు రోజుల్లో బిజెపి అభ్యర్థుల జాబితాలో దీనిపై క్లారిటీగా ఉంది.