ఈడి, సీబీఐలపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..మాకు జైలు కొత్తకాదు!

-

 

ఈడి, సీబీఐ లపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీలను ఒక్క రోజు తన చేతికి అప్పగిస్తే బీజేపీలో సగం మందిని జైలుకు పంపిస్తానని ఎన్డీటీవీ చర్చా కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ గారు వ్యాఖ్యానించారన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయనలోని ప్రతీకార ధోరణికి అద్దం పడుతున్నయి. కేంద్ర సంస్థల్ని బీజేపీ వాడుకుంటోందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తున్న కేజ్రీవాల్ గారు…. ఈ వ్యాఖ్యల ద్వారా తన అసలు రంగు తనే బయటపెట్టుకున్నారని ఆగ్రహించారు.

 

తాను కూడా అవే సంస్థల్ని వాడుకుని బీజేపీ నేతల్ని జైలుకి పంపిస్తారట. ఏ విషయంలో అయితే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నరో… అదే పని తాను చేస్తానని పబ్లిక్ వేదిక మీద చెప్పడం చూస్తే ముఖ్యమంత్రి హోదాను ఏ స్థాయికి దిగజార్చారో చెప్పాల్సిన పని లేదు. ప్రతీకార రాజకీయాలు చేస్తానని చెప్పకనే చెబుతూ బీజేపీని సవాల్ చెయ్యడం సిగ్గుచేటు. ఒకవైపు తన మంత్రులు ఒకొక్కరుగా అవినీతి వ్యవహారాల్లో పట్టుబడి జైలుకెళుతుండటంతో కేజ్రీవాల్ తట్టుకోలేకపోతున్నరు. ఇప్పటికే జైల్లో ఉన్న ఢిల్లీ సర్కారు మంత్రి సత్యేంద్రజైన్, నిబంధనలకి విరుద్ధంగా రేపిస్టుతో మాలీష్ చేయించుకుంటూ, విలాసవంతమైన విందారగిస్తున్న వీడియోలు బయటకొచ్చాయని చెప్పారు.

 

 

ఇవన్నీ తన సర్కారు పరువు తీస్తుండటంతో ఆయన భరించలేక బీజేపీ మీద పడ్డారు. పాలకుల పంజరంలో సీబీఐ చిలుకగా మారిందని ఏ సర్కారు హయాం ఉండగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందో గుర్తు చేసుకుంటే మంచిది. గత ప్రభుత్వాలు కక్ష సాధింపుతో బీజేపీ అగ్రనేతలెందరినో కేసులతో వేధించి జైలుకు పంపాయి. చట్టబద్ధంగా వాటిని ఎదుర్కుని వారు బయటకొచ్చారు… ప్రజా తీర్పుతో అధికారం చేపట్టారు. కేసులు, జైళ్లు మాకు కొత్త కాదు… ఒక్క కేజ్రీవాల్ మాత్రమే కాదు, తెలంగాణ సర్కారు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు విజయశాంతి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news