సోనియా గాంధీ తెలంగాణకు రావడంపై రాములమ్మ ట్వీట్‌ !

-

సోనియా గాంధీ తెలంగాణకు రావడంపై రాములమ్మ ట్వీట్‌ చేశారు. బీజేపీకి ఆ అర్హత లేదని విమర్శలు చేశారు విజయశాంతి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సోనియాను ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదని కాంగ్రెస్ నేత విజయశాంతి దుయ్యబట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చే అర్హత సోనియాకు ఉందని ఎంపీ కిషన్ రెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

Vijayashanthi tweet on Sonia Gandhi coming to Telangana

తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియాగాంధీని ఉద్యమకారులు ఎప్పటికైనా గౌరవిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అసలు బీజేపీ ప్రమేయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఆ సోనియా గాంధీ గారు, రేపటి జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమంకు ఎట్ల హాజరు అయితరు అని బీజేపీ నేత కిషన్ రెడ్డి గారు అడిగితే, అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో నాటి బీజేపీ ప్రమేయం ఎక్కడున్నది (ప్రత్యామ్నాయం లేక పార్లమెంటుల బిల్లుకు ఓటు వేసిన నాడు తప్ప) అని కూడా తెలంగాణ సమాజం, ఉద్యమకారులు అడిగితీరుతారని హెచ్చరించారు విజయ శాంతి.

Read more RELATED
Recommended to you

Latest news