వికారాబాద్‌ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేపై కేసీఆర్‌ వేటు !

-

వికారాబాద్ టీఆర్ఎస్ లో రాజకీయాలు వేడెక్కాయి. వికారాబాద్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌ పై తీవ్ర ఆరోపణలు చేశారు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి. ఎమ్మెల్యే కావాలనే తన కారుపై దాడి చేయించి…తన వర్గంతో అడ్డుకున్నాడని వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఆగ్రహించారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడైన ఆనంద్ అందరిని కలుపుకొని పోకుండా చిల్లర రాజకీయాలు చేస్తుండని.. తన నియోజకవర్గంలో ఉద్యమ సమయంలో పార్టీ కోసం పనిచేసిన ఉద్యమ కారులకు నామినేటేడ్ పదవులు ఇవ్వకుండా రియలెస్టేట్ వ్యాపారులకు, డాక్టర్లకు పదవులు కట్టబెడుతున్నాడని నిప్పులు చెరిగారు. గతంలో తన పేరు పక్కన తాను చదివిన డిగ్రీలు లేవని శీలాఫలకాలను పగులగొట్టి ఉంచిన ఘనత ఆనంద్ కుందని.. ప్రతి చిన్న విషయాన్ని సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లోదనే ఇన్నాళ్లు చెప్పలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అన్ని విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని.. త్వరలోనే ఆనంద్ ను జిల్లా పార్టీ పదవి నుంచి తప్పిస్తారని చెప్పారు సునీతా మహేందర్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news