ఎయిర్‌పోర్టులో గన్నులున్న బ్యాగులతో దంపతులు ప్రత్యక్షం.. ఏం చేశారంటే?

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు ఇద్దరు దంపతులను అరెస్ట్ చేశారు. వియాత్నం నుంచి భారత్‌కు విమానంలో వచ్చిన ఈ దంపతులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగులో 45 గన్స్ లను తీసుకొచ్చారు. ఈ బ్యాగ్‌ను చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ మేరకు బ్యాగును స్వాధీనం చేసుకుని కస్టమ్స్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులకు సరెండర్ చేశారు.

తుపాకులు
తుపాకులు

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వియాత్నం నుంచి ఇండియాకు విమానంలో ఓ జంట వచ్చింది. ఎయిర్‌పోర్టులోని కస్టమ్స్ అధికారులు వారి బ్యాగ్‌ను చెక్ చేసి చూశారు. దీంతో ఆ బ్యాగులో 45 వరకు గన్స్ గుర్తించారు. దంపతులు జగ్జీత్ సింగ్, జస్విందర్‌ కౌర్‌గా అధికారులు నిర్ధారించారు. అయితే ఈ తుపాకులు ఒరిజినలా లేక డమ్మీనా కనుగొనేందుకు టెర్రరిజం యూనిట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ పంపించగా.. తుపాకులు ఒరిజినల్‌ అని రిపోర్ట్ వచ్చింది. ఈ తుపాకుల ధర రూ.22 లక్షల 50 వేలు ఉంటుందని అధికారులు చెప్పారు. అయితే గతంలోనూ ఈ ఇద్దరు భార్యాభర్తలు 25 గన్స్ తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.