నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్న జీవన్ రెడ్డి అక్కడ ఉన్న ఓ మహిళను చెంప మీద కొట్టడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఓ గ్రామంలో పర్యటించిన జీవన్ రెడ్డి.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న ఒక మహిళను ఎవరికి ఓటేస్తున్నావని అడిగారు. దానికి ఆమె పువ్వు గుర్తుకు ఓటు వేస్తానని ఆమె చెప్పడంతో అక్కడున్న నేతలంతా ఒక్కసారిగా నవ్వారు. దీంతో జీవన్ రెడ్డి వెంటనే ఆ మహిళ చెంపపై చేత్తో కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేశానని, అయితే పింఛన్ రావడం లేదని వాపోయిన ఆ మహిళ తాను ఈసారి బీజేపీకి వేయాలనుకుంటున్నట్టు తెలిపారు.