తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీఆర్ఎస్ వరంగల్ మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా వరంగల్ అభ్యర్థిని కూడా ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. తొలుత కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేరు ప్రకటించినప్పటికీ.. కావ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో అక్కడ మళ్లీ తాజాగా అభ్యర్థిని అనౌన్స్ చేశారు.
అంతకు ముందు వరంగల్ ఎంపీ అభ్యర్థి తాటికొండ రాజయ్య అని ప్రచారం కూడా జరిగింది. మొదటిసారి ప్రకటించిన కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న మారెపల్లి సుధీర్ కుమార్ కి వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు సుధీర్ కుమార్. తాటికొండ రాజయ్య కేసీఆర్ ఫామ్ హౌస్ వద్దకు వెళ్లేందుకు బయలు దేరారు. అక్కడ సుధీర్ కుమార్ ఉన్నారని తెలుసుకొని వెనుదిరిగినట్టు సమాచారం. మరోవైపు టికెట్ తనకు కేటాయిస్తేనే తాను ఫామ్ హౌస్ వద్దకు వస్తానని రాజయ్య చెప్పినట్టు సమాచారం.