పొన్నాలను బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించాం : కేటీఆర్ 

-

తెలంగాణలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్ వచ్చారు. పొన్నాలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించనున్నారు. పొన్నాల లక్ష్మయ్యకి బీఆర్ఎస్ లో కీలక పదవీ కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ నేతలను కాంగ్రెస్ పట్టించుకునే పరిస్థితి లేదని.. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారిని అణగదొక్కుతున్నారని విమర్శలు చేశారు పొన్నాల. ఇది బీఆర్ఎస్ కి అనుకూలంగా మార్చుకొని పొన్నాలను బీఆర్ఎస్ లో చేరాలని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. 

బలహీన వర్గాల్లో బలమైన గొంతు కలిగిన పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నాం. రేపు కేసీఆర్ ని కలిసి.. తదనంతరం 16న జనగామలో జరిగే బహిరంగ సభలో పార్టీలో చేరాలని కోరారు. రేపు సీఎం కేసీఆర్ తో మాట్లాడి.. తన నిర్ణయాన్ని వెల్లిస్తానని చెప్పారు. ఆయనకు గౌరవం, ప్రాధాన్యం ఇస్తాం అని తెలిపారు. పీవీ నరసింహారావు ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ లోనే కొనసాగాడు. కాంగ్రెస్ పార్టీ అవమానం ఎదురవుతుంటే.. ఏ కారణం చేత పార్టీలో కొనసాగాలని  పొన్నాల బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news