తెలంగాణ శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శ్రీధర్ బాబు హరీశ్‌రావు అడ్డుపడ్డారు. దీంతో హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. శ్రీధర్ బాబు లేచి నన్ను గెలికే ప్రయత్నం చేసిండు.. లేకపోతే ఆయన గురించి మాట్లాడే అవసరం నాకు లేదు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఇదే సభలో మాట్లాడుతూ.. నీ తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను పో అన్నప్పుడు.. పేగులు తెగే దాకా కొట్లాడిందేవరు.. పెదవులు మూసుకున్నదేవరో రాష్ట్ర ప్రజలకు గుర్తున్నది.
ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది ఆరోజు ఉన్నారు. ఆ రోజు మేం పేగులు తెగేదాకా పోడియంలోకి వెళ్లి కొట్లాడినం. ఆ రోజు మీరు పెదవులు మూసుకున్నరు. ఆ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దచయేసి మా మీద విమర్శలు మానండి. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో ఆలోచించండి. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా సలహాలు, సూచనలు ఇస్తున్నాం. కానీ నెపాలు పెట్టి, బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి. పరిపాలన మీద దృష్టి పెట్టాలి అని శ్రీధర్ బాబుకు హరీశ్‌రావు గట్టిగా కౌంటర్ ఇచ్చారు.