ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఉమెన్స్ టీం ఘన విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు ఏకంగా 340 పరుగుల తేడాతో ఇంగ్లాండును చిత్తు చేసి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచినా ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో 428 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ మహిళల జట్టు 136 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 186 పరుగులు లు చేసిన ఇండియా 479 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది.
భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్ 131 పరుగుల కి చాపచుట్టేసింది. దీంతో టెస్టుల్లో అత్యధిక పరుగుల విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే తొలి ఇన్నింగ్స్ లో 38 పరుగులు ఇచ్చి 9 వికెట్లు తీయడంతో పాటు కీలకమైన 67 పరుగులు చేసిన దీప్తి శర్మకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.కాగా ఇప్పటివరకు 39 టెస్ట్ మ్యాచ్లు ఆడిన భారత మహిళల జట్టు కేవలం 6 విజయాలను మాత్రమే సాధించింది.