మిమ్మల్ని వదిలేదే లేదు.. బీఆర్ఎస్ నేతలకు సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్

0
19

కేసీఆర్  ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. బీఆర్ఎస్  హయాంలో స్కీముల పేరుతో స్కామ్ లు చేశారని అలాంటివారిని వదిలేది లేదన్నారు. ఇవాళ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం బత్తులపల్లిలో సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీతక్క గొర్రెల పంపిణీ స్కీమ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కీమ్ కింద పేద ప్రజల వద్ద నుంచి డబ్బులు తీసుకున్న వారిని ముక్కుపిండి వసూలు చేస్తామన్నారు. మా ప్రభుత్వ ఈ పథకాన్ని వినూత్నంగా అమలు చేస్తామని చెప్పారు. వరల్డ్ హెరిటేజ్ కాబట్టి ప్రబంచ దేశాల సుందరీమణులను రామప్ప టెంపుల్ కు ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

మరో వైపు గొర్రెల స్కామ్  కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కీలక నిందితులైన మొయినుద్దీన్ ఇంటిలో ఏసీబీ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు సేకరించింది. అతడి ఖాతా నుంచి అతడి భార్య అకౌంట్ కు భారీగా డబ్బు బదిలీ అయినట్లు గుర్తించారు. ఆయితే ఈ కేసులో మొయినుద్దీన్ తో పాటు ఆయన కుమారుడు ఇక్రముద్దీన్ పాత్ర కీలకంగా ఉందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ తండ్రి కొడుకులిద్దరు ప్రస్తుతం పరారీలో ఉండగా, వారిని వెన్కకి రప్పించేందుకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.