ధరణి పేరుతో ఆక్రమించుకున్న భూములను బయటకు తీస్తాం – కోమటిరెడ్డి

-

ధరణి పేరుతో బిఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్న భూములను బయటకు తీస్తామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో ప్రజాపాలనపై అధికారులు, ముగ్గురు మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోవడం తెలంగాణకే తలవంపులని విమర్శించారు కోమటిరెడ్డి.

మరోవైపు కాళేశ్వరం డిజైన్ చేశానని చెప్పుకున్న కేసీఆర్.. ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని, కనీసం కాలువలు కూడా తవ్వలేదని దుయ్యబట్టారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మించినా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. కెసిఆర్ కేవలం తన 400 ఎకరాల ఫామ్ హౌస్ కోసమే పని చేశారని అన్నారు. డిండి ప్రాజెక్టుల పేరుతో భూములను లాక్కున్నారని గుర్తు చేశారు. పదేళ్లుగా విధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడుతున్నామని చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి. పేదలకు ప్రభుత్వ పథకాలు అందించాలన్నదే తమ ప్రయత్నమని అన్నారు. తాము ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news