ఎన్టీఆర్ “దేవర” మూవీపై కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవర. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానుంది. ఈ సినిమాపై అంచనాలు ఆకాశమంత ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ అయ్యారు ఎన్టీఆర్. ఈ మూవీ తర్వాత దేవర చేస్తుండడంతో విపరీతంగా క్రేజ్ ఉంది.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి భాగం 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. సముద్ర తీర ప్రాంతంలో ఉండే ప్రజల కోసం పోరాడే యోధుడిగా దేవర సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, కలైయరాసన్, మురళీ శర్మ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా నిర్మాత, ఎన్టీఆర్ సోదరుడు, టాలీవుడ్ హీరో అయినటువంటి నందమూరి కళ్యాణ్ రామ్ తన చిత్రం డెవిల్ రిలీజ్ సందర్భంగా చేస్తున్న ప్రమోషన్స్ లో “దేవర” సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. దేవర షూటింగ్ ఇప్పటికే 80% కంప్లీట్ అయిందని కన్ఫర్మ్ చేశాడు కళ్యాణ్ రామ్. ఇక గ్లింప్స్ తాలూకు విఎఫ్ఎక్స్ పనులు అనుకున్నట్లుగా పూర్తయితే విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని నందమూరి అభిమానులకు శుభవార్తని అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news