హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో చిత్రమైన ఘటన జరిగింది. పెళ్లిలో అత్తింటివారు పాత మంచం ఇచ్చారని వరుడు పెళ్లికి డుమ్మా కొట్టాడు. మౌలాలికి చెందిన జకారియా (26)కు బండ్లగూడ యువతితో నిన్న పెళ్లిజరగాల్సి ఉంది.
శనివారం వధువు తండ్రి మంచం, ఇతర ఫర్నిచర్ వరుడికి పంపగా, పరిశీలిస్తుంటే మంచం విరిగింది. దీంతో పాత మంచం పంపారని వరుడు పెళ్లికి వెళ్లలేదు. పోలీసుల జోక్యంతో పెళ్లికి వరుడు సిద్ధమైనా, వధువు తండ్రి నిరాకరణతో ఆగింది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.