బలిదేవతను ఎందుకు పిలుస్తున్నావు.. రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కౌంటర్..!

-

రేవంత్ రెడ్డి దొంగల ముఠా నాయకుడు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి 420 హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను మభ్య పెట్టారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ను తిట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారే తప్ప ఈ ఐదు నెలల్లో రేవంత్ చేసిందేమి లేదన్నారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ అని.. అందుకే కాంగ్రెస్ అభ్యర్థులుగా దొంగలనే ఖరారు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పట్టభద్రులు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సీఎంగా పదవి భాద్యతలు చేపట్టగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాల నియామకాలు పూర్తి చేయడం తప్ప రేవంత్ చేసిందేమి లేదన్నారు. ఇచ్చిన ఉద్యోగాలకు ఇప్పటికీ జీతాలు ఇవ్వలేదని.. కేసీఆర్ హయాంలో లక్షా 48 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరో 50 వేల ఉద్యోగాల భర్తీ వివిధ దశల్లో ఉందన్నారు. 2004 -2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది 20 వేల ఉద్యోగాలు మాత్రమే అని గుర్తు చేశారు. నిరుద్యోగంపై దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ రెచ్చగొట్టిందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలోనైనా నిరుద్యోగులు వాస్తవాలు గ్రహించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news