జూనియర్ ఎన్టీఆర్ పై బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చంద్రబాబు పనే : వైసీపీ

-

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు టీడీపీతో సంబంధం లేదని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ట్విట్టర్ (ఎక్స్)లో విమర్శలు గుప్పించింది. టీడీపీకి అసలు వారసడైన ఎన్టీఆర్ పై టీడీపీ నేత వెంకన్న నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనతో ఈ మాటలు అనిపిస్తోంది చంద్రబాబు కాదా..? రాజకీయాలకు పనికి రాని లోకేష్ ను పైకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు చేసే వెన్నుపోటు రాజకీయాలకు ఇదే నిదర్శనం అని పేర్కొంది.

జూనియర్ ఎన్టీఆర్ 2014, 2019, 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేయలేదని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. ఆయనకు పార్టీతో సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని మాట్లాడుతున్నారని ఈ అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ బాధ్యతలను నారా లోకేష్ కు అప్పగించాలని పునరుద్ఘాటించారు. 

Read more RELATED
Recommended to you

Latest news