కాంగ్రెస్ బెస్ట్ అయింది బిజెపి కంటే… ఎందుకో చూడండి…!

-

తెలంగాణాలో భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించాలని బిజెపి అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు ఆ పార్టీకి కలిసి రావడం లేదు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కనీసం పార్టీకి ప్రచారం చేసే నాయకులు లేరు. అసలు లోపం ఎక్కడ ఉంది…? నాయకులది ఎంత వరకు తప్పు ఉంది…? దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి గెలవడం పక్కన పెడితే కనీసం రెండో స్థానంలో అయినా నిలవాల్సిన అవసరం అనేది ఉంది. కాని ఆ దిశగా కూడా అడుగులు వేయడం లేదు.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్, యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గాని ప్రచారం చేయడానికి ముందుకు రావడం లేదు. బండి సంజయ్ ప్రచారం చేసినా సరే ఆయన ఆశించిన స్థాయిలో క్షేత్ర స్థాయిలో తిరగడం లేదు. కిషన్ రెడ్డి రెండు రోజులు ప్రచారం చేసి, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను కేంద్ర మంత్రి హోదాలో చెప్తే ఎంత బాగుంటుంది…? అయినా సరే ఆయన ఆ ప్రయత్నం చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు.

ఇక ఆయనతో పాటుగా రాష్ట్ర పార్టీలో కాస్త సమర్దవంత నేతలు గాని, జాతీయ స్థాయిలో ఉన్న నేతలు గాని ప్రచారం చేయలేకపోతున్నారు. కనీసం కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం లేదు. ధర్మపురి అరవింద్ చేసే వ్యాఖ్యలకు మంచి ఇమేజ్ ఉంది. కాని ఆయన మాట్లాడటం లేదు. ఒక పక్క మంత్రి హరీష్ రావు అదే పనిగా నియోజకవర్గంలో తిరుగుతున్నా సరే ప్రాధాన్యత కూడా బిజెపి గుర్తించడం లేదు. యువ నేతలు ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్నారు. వారు కూడా క్షేత్ర స్థాయిలో తిరగడం లేదు.

డీకే అరుణకు మంచి ఇమేజ్ ఉంది, కేసీఆర్ ని ధైర్యంగా ఆమె విమర్శించే సామర్ధ్యం ఉన్న నేత. అయినా సరే ఆమె కూడా ముందుకు వచ్చి విమర్శించలేకపోతున్నారు. ఒకరకంగా బిజెపితో పోలిస్తే కాంగ్రెస్ చాలా బెస్ట్, రేవంత్ రెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, మాణిక్యం ఠాకూర్ వంటి వారు నియోజకవర్గంలోనే ఎక్కువగా తిరుగుతున్నారు. మరి బిజెపి ఇవేమీ లేకుండా ఎలా బలపడుతుందో…?

Read more RELATED
Recommended to you

Latest news