కేసీఆర్ పక్కకు పోగానే కరెంట్ ఎందుకు మాయమైందని ప్రశ్నించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చేవెళ్ల బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారు. నాలుగు నెలకే కాంగ్రెస్ కుదేలు అయింది. ఎన్నికల హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. తాను బతికి ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తానని పేర్కొన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నాం. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయండి అని ప్రశ్నించారు.
దళిత బంధు ఇవ్వకుంటే లబ్దిదారులతో కలిసి అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేస్తానని పేర్కొన్నారు కేసీఆర్. ముఖ్యంగా ప్రభుత్వం అంటే ప్రజలకు ధీమా, ధైర్యం ఉండాలన్నారు. తమకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఆదుకుంటుందనే విశ్వాసం ఉండాలని తెలిపారు. అందుకోసమే ప్రభుత్వాన్ని ఎన్నుకునే ముందు ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు. తెలంగాణలోని అన్ని ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలన్నారు కేసీఆర్. చెవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డికి ఏం తక్కువ చేశాం.. ఆయన బీఆర్ఎస్ లోకి ఎందుకు పోయాడని ప్రశ్నించారు.