కాళోజీ కళాక్షేత్రాన్ని తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ఎందుకు పూర్తి చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళోజీ గురించి బీఆర్ఎస్ నేతలు గొప్పగా మాట్లాడుతారు. కానీ ఇన్ని రోజులు గడిచినా వరంగల్ లో కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయలేదు. ఆగమేఘాల మీద ప్రతిభవన్, సచివాలయంను పూర్తి చేశారు. కళాక్షేత్రాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పూర్తి కానీ కాళోజీ కళాక్షేత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ సొంత ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ అవమానిస్తోంది. ప్రాజెక్టులపై నల్గొండలో కాదు.. దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ సహకారం లేకుండానే ఏపీ పోలీసులు తెలంగాణకు వస్తారా..? అని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నల్గొండ జిల్లా సస్యశ్యామలంగా ఉండేదన్నారు. బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పులు చేసి.. SLBC ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం బీఆర్ఎస్ చేతకానీ తనం కాదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.