నాయకత్వ లోపంతో తెలంగాణ కాంగ్రెస్‌ కనుమరుగౌతుందా..?

-

భారత స్వాతంత్య్రం తర్వాత దేశ వ్యాప్తంగా ఒక వెలుగు వెలిగిన దాదాపు ఆరు దశాబ్దాలు ఏలిన పార్టీకి ఇప్పుడు గుడ్డు పరిస్థితిలు వచ్చాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ప్రపంచం గర్వించ దగ్గ నాయకత్వం ఆందించిన హస్తం పార్టీకి ఇప్పుడు నాయకత్వం లోపంలో సతమతమౌంది.. ఇందీరా గాంధీ తర్వాత దేశ వ్యాప్తంగా పార్టీ పరిస్థితి క్రమంగా దిగజారుతుంది.. తెలుగురాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌ నుంచి గొప్ప నాయకులు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.. నీలం సంజీవరెడ్డి, పీవీ,భూర్గుల, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి..ఇలా చెప్పుకుంటుపోతే చాలా మందిని పేర్లు చెప్పవచ్చు..


ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది..వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తర్వాత పార్టీకి ప్రజలకు మధ్యం దూరం పెరుగుతూ వస్తుంది.. మరి ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి మరి దారుణంగా ఉంది.. ఎన్నికలు ఏవైన డిపాజిట్ కోల్పోవడం కాంగ్రెస్‌ వంతు అవుంది.. రాష్ట్రనాయకత్వంలో ఉన్ని మార్పులు చేసిన.. వైఎస్‌ లాంటి నేత కాంగ్రెస్‌కు కునుచూపు మేరలో కన్పించడం లేదు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమి సంపూర్ణం అయిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.. ఈ ఉప ఉన్నికలో కనీసం పార్టీకి డిపాజిస్ట్‌ కూడా దక్కకపోవడంతో.. ఇక సమీప భవిష్యత్తులో ఆ పార్టీ కోలుకోవడం చాలా కష్టం అని తీర్మానిస్తున్నారు.. కానీ పాజిటివ్ ఓటు కంటే నెగిటివ్ ఓటే ఎక్కువ ప్రభావం కలిగించే పరిస్ధితుల మధ్య ఆ పార్టీని కొట్టిపారేయడం తొందరపాటుతనమే కాగలదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అంపశయ్యపై ఉన్నది.. రాష్ట్రం ఇచ్చిన క్రెడిట్‌ను ప్రజల్లోకి తీసుకుపోడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలం చెందింది.. రాష్ట్రం సాధించిన క్రెడిట్‌ కాస్తా టీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్లింది.. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ తీరుగులేని పార్టీగా అవతరించింది.. కానీ రాష్ట్రం ఇచ్చిన పార్టీ క్రమంగా తెలంగాణ ప్రజలుకు దూరం అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు దూరం కావడానికి చాలా కారణాలే ఉన్నప్పటికీ.. ప్రతిసారి ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాలు బయటకు వస్తాయి.. రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నేతలు బహిరంగగానే విమర్శలు చేయడంతో కార్యకర్తలు నిరుత్సాహంగా మారుతున్నారు.

అదే అదనుగా బావించి మిగతా పార్టీలు కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నాయి.. ప్రజల్లో కాంగ్రెస్‌పై వస్తున్న వ్యతిరేఖతను,అసంతృప్తిని కాంగ్రెస్‌ ప్రత్యర్థి పార్టీలు అవకాశంగా మాలుచుకుంటున్నాయి.. పార్టీ కేడర్‌ చేసేది లేక ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రజల నుంచి దూరంగా వెళ్లడానికి అంతర్గత వివాదాలే కారణమంటున్నారు మేధావులు.. కాంగ్రెస్‌లో మొదటి నుంచి గ్రూప్‌ రాజకీయాలు సహజం.. అయితే అవి బహిర్గతం కావడం వల్ల ప్రజల్లో పార్టీపై విశ్వాసం కొల్పోవడానికి కారణమవుతుంది.. ఆ పార్టీ కోలుకోకపోవడానికి అంతర్గత పరిస్థితులే అతి ప్రధాన కారణం. ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు. ఏ పార్టీ అయినా సరే తన పనితనాన్ని రుజువు చేసుకోవాలంటే ఆ పార్టీ అంతర్గత నిర్మాణం, పని విధానం సక్రమంగా ఉండాలి.

నాయకత్వం శక్తివంతంగా ఉండడమే కాకుండా దిగువ నాయకత్వం, కార్యకర్తలు సైతం తమ నాయకత్వానికి తగిన శక్తిని అందించగలగాలి.. కానీ కాంగ్రెస్ కు ఇప్పుడు అదే లోపించింది.. కాంగ్రెస్ యువరాజుగా రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ ఇప్పటికీ తన నాయకత్వ ప్రతిభ ఏపాటిదో రుజువు చేసుకోలేకపోయారు.. తెలంగాణలో ఉత్తమ్‌ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది.. అతని నాయకత్వంలో పార్టీ గొప్పగా సాధించిన విజయలేవి లేవు.. పైగా ప్రతి ఎన్నికల్లో పార్టీ ఓటింగ్‌ శాతం క్రమంగా తగ్గుతూ వస్తుంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో రాష్ట్ర నాయకత్వం ఒంటెద్దు పోగడలు.. కింది స్థాయి నాయకత్వంపై నిర్లక్ష్యంలో రోజురోజుకు పార్టీ దిగజారీపోతుంది.. రేవంత్ రెడ్డి లాంటి యువ నాయకుడు ప్రభుత్వంపై కొంత దూకుడుగా వ్యవహరించినప్పటికి.. అతన్ని రాష్ట్ర నాయకత్వంలోని కొంత మంది సీనియర్స్ అన్ని అణదొక్కే ప్రయత్నాలుచేస్తున్నారు.. దీంలో ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయకుండా ప్రజల్లోకి పార్టీ ఎలా వెళుతుందని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. ఇలా అనడానికి కారణం ఎన్నికల్లో ఆ పార్టీ ఎదుర్కొన్న ఘోర ఓటములు ఒక్కటే కాదు.

ముందే చెప్పినట్లు పాజిటివ్ ఓటు కంటే నెగిటివ్ ఓటే ఎక్కువ ప్రభావం కలిగిస్తున్నప్పుడు వరుసగా ప్రభుత్వాలు నడిపిన పార్టీ ఓటమిని ఎదుర్కోక తప్పడం లేదు.. రెండుసార్లు వరుసగా ప్రభుత్వం నడిపిన పార్టీ మూడోసారి కూడా గెలిస్తే గనక అది ఆ పార్టీ ఘనతగా కంటే, ప్రతిపక్షం చేతగానితనంగా మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది. భారత దేశంలో ఉన్న పరిస్ధితులు అలాంటివి.. ఆ పార్టీ నాయకత్వంతో పాటు, ప్రస్తుత నాయకత్వం తప్ప మరో గత్యంతరం లేని పరిస్ధితిలో కాంగ్రెస్ ఉంది చూసారూ, అదే ఈ పరిస్ధితికి కారణం.. ఎంత ఘోరం అంటే,గెలుపు కోసం ఆ పార్టీ కనీసం ప్రయత్నం చేయడం కూడా మానేసింది.

తెలంగాణ కాంగ్రెస్ ఈ పరిస్ధితిలో ఉండడానికి కారణం ఆ పార్టీ రాష్ట్ర నాకత్వంలో ఉన్న అంతర్గత కుమ్మూలటే కారణం.. రాష్ట్రనేతల్లో ఉన్న వర్గాధిపత్య ధోరిణితోనే పార్టీని బలహీనపరిచారని, చివరికి ఊపు తెచ్చుకుని ‘పోరాడదాం’ అన్నా సరే, లేవలేని విధంగా కూలబడిపోయింది.. ఎన్నికల వరకు తీసుకుంటే ఇది నిజమేనన్నది కనిపిస్తున్న విషయమే.ఎన్నికల యుద్ధంలో దిగిన తర్వాత ఓటమి తప్పదని తెలిసినా సరే, చివరి వరకూ ప్రయత్నించడం, పోరాడడం రాజకీయ పార్టీల కర్తవ్యం.. లేనట్లయితే వారు చెప్పే రాజకీయ సిద్ధాంతాలను.. అవి ఎంత అబద్దపు వాగ్దానాలైన సరే.. చెప్పడమే దండగ. అసలు అలాంటి పార్టీ ఉనికిలో ఉండడమే దండగ.. కాడి కింద పడేసి ప్రత్యర్ధికి గెలుపును బంగారు పళ్ళెంలో పెట్టి అప్పగించే పార్టీ ఉనికిని జనం ఎందుకు గుర్తించాలి?

ఒక్క దుబ్బాక ఉప ఎన్నికలే కాదు.. చాలా రాష్ట్రాల్లోని ఉప ఎన్నికలు, ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికలు తీసుకున్నా అనుకున్న స్థాయిలో పుంజుకోలేకపోయింది.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అధిష్టానం నుండి వచ్చిన ప్రోత్సాహం ఏమీ లేదు. అసలు ఢిల్లీ నుంచి వచ్చి రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలే చాలా తక్కువ. ఎలాగూ ఓడిపోతాం గదా అన్న ఉదాసీనతే అధిష్టానంలోనూ..పార్టీలోనూ కనిపించిందని విశ్లేషకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news