తెలంగాణలో కేసీఆర్ చరిష్మా తగ్గుతుందా.?..దుబ్బాక ఓటమికి అదే కారణమా?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేకంగా స్థానం ఉంది..అది ఎవ్వరు అనున్నకాదన్న నిజం..ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ చూపించిన రాజకీయ ఎత్తుగడలు ఎవరి ఊహకు కూడా అందేవి కాదు..తెలంగాణ రాష్ట్రం సాధించేవరకూ నిరంతరం పోరాటం చేసేవారు..యావత్తు తెలంగాణ ప్రజలను నిత్యం అప్రమత్తం చేసేవారు..దేశంలో ఉన్న రాజకీయ ఉద్దండులను సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో దూసుకుపోయోవారు..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తన రాజకీయ చతురతతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు..గత ఏడు సంవత్సరాల్లో వచ్చిన ఏ ఎన్నికలైన గెలుపు కొసం చాలా రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ పార్టీని గెలిపించేవారు..ఎన్నికల ఏవైనా విజయం టీఆర్‌ఎస్‌ పార్టీదే అన్న విధంగా రాజకీయ ఎత్తుగడులు అమలు చేసేవారు.
ఎంత మంతి రాజకీయ ఉద్దండులు తెలంగాణపై ఎన్ని రకాల రాజకీయ వ్యూహాలు అమలు చేసిన..కేసీఆర్ ముందు మోకరిల్లేవారు..ఎన్నికలంటే కేసీఆర్‌- ఎన్నికలంటే టీఆర్‌ఎస్‌ గెలుపు అన్నట్లు తెలంగాణలో గత ఏడు సంవత్సారాలు కొనసాగింది..రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీలో మొదటి సారి ఎన్నికల సమయంలో ఉన్న దూకుడు కనిపించడంలేదు..గత కొంత కాలంగా టీఆర్ఎస్‌లో ముఖ్యంగా కేసీఆర్‌ రాజకీయ ఎత్తుగడలు అమలు చేయడంలో కాస్త దూకుడు తగ్గినట్లు కన్పిస్తుంది..ముఖ్యంగా ప్రతి పక్షాలపై నిత్యం విరుచుకుపడే కేసీఆర్‌ ఈ మధ్య ఆ దూకుడు తగ్గినట్లు కనిపిస్తుంది..అందుకు రాజకీయంగా చాలా కారణాలు ఉన్నప్పటికి..బయటకు కన్పించే అంశాలపై కేసీఆర్‌ తీరుపై ప్రజల్లో కేసీఆర్‌పై అసంతృప్తి కన్సిస్తుంది..
తాజాగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల్లో క్రమంగా ప్రభావం తగ్గుతున్నట్లు కన్సిస్తుంది..దానికి రాజకీయంగా అనేక కారణాలు ఉన్నపట్టికి కేసీఆర్‌ & పార్టీ నేతల స్వయం కృత అపరాధమే అంటున్నారు విశ్లేషకులు..కేంద్ర ప్రభుత్వం తీరుపై మొదటి నుంచి కేసీఆర్‌ అనుసరించిన విధానాలే ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్‌ పార్టీకి ప్రత్యమ్నయంగా బీజేపీ పార్టీ ఎంచుకుంటున్నారు ప్రజలు..తెలంగాణలో రాజకీయ శూన్యతను ఇప్పుడు బీజేపీ భర్తీ చేస్తుంది..క్రమంగా తన బలాన్ని పెంచుకుంటుంది..ఇప్పుడు టీఆర్‌ఎస్ పరిస్థితి ఎవరు తీసుకున్న గోయ్యిలో వారు పడ్డాట్టు తయారయ్యింది..దుబ్బాక ఎన్నికలలో ఓటమితో చేసిన తప్పులను కక్కలేక మింగలేకగా తయారైంది కేసీఆర్‌ సరిస్థితి..కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు..తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ గ్రాఫ్‌ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి..మొదటి నుంచి బీజేపీ పార్టీని పెద్దగా పట్టించుకొని కేసీఆర్..తమకు రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే నని దానిపై ఫోకస్ పెట్టారు..చాప కింద నీరూల బీజేపీ విస్తరిస్తుంటే అంచన వేయటంలో విఫలం చెందారు..కాంగ్రెస్ పార్టీని బలహీన పర్చడంలో చూసించిన శ్రద్ధ బీజేపీని బలపడకుండా చేయడంలో కేసీఆర్ అంచనాలు తప్పారు..దీంలో రాష్ట్ర రాజకీయంలో బీజేపీ విస్తరించడానికి పరోక్షంగా కేసీఆర్‌ చర్యలు సహకరించాయి..2014 నుంచి 2019 వరకూ బీజేపీతో కేంద్రంలో కేసీఆర్ చాలా సన్నిత సంబంధాలు ఉండేవి..మోడీ తీసుకునే వివాదాస్పద నిర్ణయాలను రాష్ట్ర సీఎంగా కేసీఆర్ ఎప్పుడు బహిరంగంగా విమర్శించిన దాఖలాలు లేవు…కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే అక్కడక్కడ విమర్శించేవారు..తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాలను ఎప్పుడు విమర్శించలేదు..తెలంగాణ హక్కుల కోసం కేంద్రంపై సీరియస్‌గా పోరాడలేదు..ఏపీకి ఏడు మండలాలు ఇచ్చినప్పుడు కూడా చప్పుడు చేయలేదు..వివాదాస్పద జీఎస్టీ చట్టానిక బహిరంగానే మద్ధతూ ఇచ్చారు..చేతులు కాలినా ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు కేంద్రం నుంచి జీఎస్టీ బకాయిలు రావడం లేదని గగ్గోలు పెడుతున్నారు..కేంద్రం నుంచి రాష్ట్రానికి రాజ్యంగా బద్దంగా రావల్సిన హక్కులు,నిధులు, ప్రాజెక్టుల గురించి ఎన్నడూ కేంద్రంపై ,ముఖ్యంగా బీజేపీపై పోరాటం చేయలేదు,విమర్శించలేదు..బయ్యారం ఉక్కు కంపెనీ, ITIR, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ…ఇలా చేప్పుకుంటూ పోతే కేసీఆర్ విఫలం చేందిన అంశాలు చాలాలే ఉన్నాయి..తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్ట్‌ కు జాతీయ హోదా ఇవ్వకున్న కేంద్రాన్ని ప్రశ్నించలేదు..విభజ చట్టం ప్రకారం రాష్ట్రానికి రావల్సిన నిధులుపై కేసీఆర్ ఎన్నడు మాట్లాడలేదు..అవకాశం దోరినప్పుడల్లా మోడీ నాయకత్వం అభినందిస్తుంటే సంతోష పడ్డారు కాని..అది విస్తరిస్తున్న తీరు..తెలంగాణ ప్రజలను నెమ్మదిగా తమ వైపు తిప్పుకుంటుంటే కేసీఆర్‌ మాత్రం ఈ రాజకీయ ఎత్తుగడను గుర్తించడంలో విఫలం చేందారు..రాష్ట్రంలో ,దేశంలో కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి మూడో ఫ్రంట్‌ రాజకీయాలు ప్రారంభించారు..తెలంగాణలో కాంగ్రెస్‌ను తగ్గించి బీజేపీని ఇన్‌డైర్టెక్టు గా ప్రోత్సహించారు..అందుకు ప్రతి ఫలంగా బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీలను గెలిపించుకుంది..ఇప్పుడు దుబ్బాకలో టీఆర్ఎస్‌ ఘోర పరాభవం.. కేసీఆర్ కేంద్రంతో అనుసరించిన విధానాలే కారణం అంటున్నారు..రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్ఎస్‌ కు బీజేపీ ప్రత్యాహ్నయంగా మారింది..వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై దుబ్బాక ఓటమి ప్రభావం చాలా వరకూ ఉంటుంది..ఇప్పటికైనా కేసీఆర్ తన చరిష్మాను తిరిగి ప్రజల్లో పొందాలంటే గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది..