తెలంగాణ మందుబాబులకు బిగ్ షాక్. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రెండు రోజులు వైన్‌షాపులు మూసివేయనున్నారు. 13వ తేదీ ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో మధ్యం అమ్మకాల పై నిషేధం విధించారు ఎన్నికల అధికారులు. దింతో ఇవాళ్టి నుండి 13 వ తేదీ వరకు మద్యం అమ్మకాల పై నిషేధం విధించారు ఎన్నికల అధికారులు.

ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి 13 వ తేదీ పోలింగ్ ముగిసే వరకు వైన్‌షాప్‌లు క్లోజ్ కానున్నాయి. పోలింగ్ పూర్తిగా ముగిసిన తరువాతే తెరుచుకోనున్నాయి వైన్ షాపులు. కాగా, ఇవాళ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కానుంది. ఈ రోజు నాల్గో విడత ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కానుంది.. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుంది ఎన్నికల ప్రచారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు నాల్గో విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మే 13న పోలింగ్ జరుగనుంది.