తెలంగాణలో డిసెంబర్ 31వ తేదీన ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చిపడింది. నిన్న ఒక్కరోజే అబ్కారీ శాఖకు 215 కోట్ల 74 లక్షల ఆదాయం చేకూరింది. అమ్మకాలు తగ్గినప్పటికీ ధరలు పెరిగిన కారణంగా భారీగా ఆదాయాన్ని ఆర్జించింది అబ్కారీ శాఖ. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 మద్యం డిపోల నుండి జరిగిన రిటైల్ అమ్మకాలు వివరాలు ఇలా ఉన్నాయి.
“జనవరి 1 ఉదయం 12 గంటల వరకు సుమారుగా 2 లక్షల 17 వేల 444 లిక్కర్ కేసులు అమ్ముడయ్యాయి. సుమారుగా ఒక లక్ష 28వేల 455 కేసుల బీర్ కేసులు. హైదరాబాద్ 1 డిపో 15 వేల 251 లిక్కర్ కేసులు, 4వేల 141 కేసుల బీర్ కేసులు, 16కోట్ల 90 లక్షలు ఆదాయం. హైదరాబాద్ 2 డిపో 18 వేల 907 లిక్కర్ కేసులు 7వేల 833 బీర్ కేసులు, 20 కోట్ల 78 లక్షల ఆదాయం. హైదరాబాద్ రెండు డిపోల్లో వచ్చిన ఆదాయం 37 కోట్ల 68 లక్షల ఆదాయం”.