తెలంగాణ సెంటిమెంట్​తో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు.. కేటీఆర్​పై షర్మిల ఫైర్

-

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని ఓవైపు అధికార బీఆర్ఎస్.. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తుంటే.. ఇంకోవైపు వైఎస్సార్టీపీ కూడా వచ్చే ఎన్నికల్లో తమ ప్రభావం చూపాలని ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజల్లోకి తమ పార్టీని తీసుకెళ్లేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వీలైనప్పుడల్లా అధికార పార్టీ వైఫల్యాలు ఎండగడుతున్నారు. ఓవైపు ప్రజల్లోకి వెళ్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడుతున్నారు. తాజాగా షర్మిల.. రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​పై సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (ట్విటర్) వేదికగా మండిపడ్డారు.

తెలంగాణ సెంటిమెంట్ పేరుతో ప్రజల్ని ఇంకెన్నాళ్లు… మోసం చేస్తారని వైఎస్ షర్మిల మంత్రి కేటీఆర్​ను ప్రశ్నించారు. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో….కేసీఆర్‌ కుటుంబం పదవులు అనుభవిస్తోందని షర్మిల ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని హామీలు నెరవేర్చారో….శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ద్రోహులు అన్న వాళ్లే…..ఇప్పుడు మంత్రులుగా ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం ప్రజల్ని మోసగించడం తప్ప చేసిందేమీ లేదని షర్మిల విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news