దళిత బంధు పథకం…ఎమ్మెల్యేల రాబందులా మారిందని ఫైర్ అయ్యారు వైయస్ షర్మిల.దళితబంధు పథకానికి ఎమ్మెల్యేలే రాబందులు అని చెప్పిన దొర…దొంగలకే మళ్ళీ తాళాలు కట్టబెట్టాడని సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఎవరెంత తిన్నారో అన్ని లెక్కలు ఉన్నాయని బెదిరించి..ఎన్నికలకు కావల్సినంత తినండని మళ్ళీ BRS దొంగలకే భాద్యతలు ఇచ్చాడని ఆరోపించారు.
అర్హుల ఎంపిక భాధ్యత మీ బందిపొట్లకే మరోసారి ఇచ్చి..దళితబంధు పథకాన్ని “కమీషన్ల బంధు” అని చెప్పకనే చెప్పారన్నారు. నియోజక వర్గానికి 11 వందల మంది అంటే..ఒక్కో ఎమ్మెల్యే సగం కమీషన్లు తిన్నా 55 కోట్లు..100 నియోజక వర్గాల లెక్కలు కడితే 6 వేల కోట్లు అని తెలిపారు. దళిత బిడ్డల పేరు చెప్పి ఎన్నికల వేళ ఎమ్మెల్యేలకు దొచిపెట్టే కుట్ర ఇది….కమీషన్లు కొట్టండి..ఎన్నికల్లో ఖర్చు పెట్టండి..ఇదే దొర ఎమ్మెల్యేలకు ఇచ్చిన బంపర్ ఆఫర్ అంటు చురకలు అంటించారు.పథకం పక్కదారి పట్టిందని, ఎమ్మెల్యేలు పబ్లిక్ గా దోచుకుంటున్నారని… దళితబంధు ఎమ్మెల్యేల బంధులా మారిందని.. సాక్ష్యాధారాలు బయట పెట్టినా..దొర తీసుకున్న చర్యలు శూన్యమంటు నిప్పులు చెరిగారు.