తెలుగు బిగ్ బాస్ షో: ఇనాయ ఏడుపులు, రేవంత్ ఓదార్పులు.!

-

తెలుగు బిగ్ బాస్ షో కంటెస్స్టెంట్ ల పోరాటం తో రక్తి కడుతుంది. అసలే మసాలా బ్యాచ్ మరియు కామెడీ బ్యాచ్ పోవటం తో ఢీలా పడ్డ షో ను నిర్వాహకులు కంటెస్స్టెంట్ మధ్య గిల్లి కజ్జాలు పెడుతూ, కెప్టెన్సీ టాస్క్ లలో యుద్దవాతావరణం కల్పించి వారి మధ్య మరిన్ని తగాదాలు అయ్యేలా చేస్తున్నారు.

ఇక నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో చిన్న పాటి కొట్లాట జరిగింది. కెప్టెన్సీ కోసం అందరూ విపరీతంగా పోరాటం చేశారు.ఇక హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి నేటి వరుకు ఇంటి కెప్టెన్ అవ్వాలనే కోరికతో టాస్కులలో ప్రాణం పెట్టిమరీ ఆడుతున్న ఇనాయ కి మరోసారి నిరాశే ఎదురు అయ్యింది.కెప్టెన్సీ టాస్క్ లో ముందు కలిసి ఆడిన శ్రీహాన్  మరియు రోహిత్ చివరకి ఫైనల్ చేరారు.

ఇక ఫైనల్ సమరం లో తన స్నేహితుడు శ్రీహాన్ ను ఓడించి ఇంటి కెప్టెన్ అయ్యాడు.ఇక ఇప్పటి దాకా కెప్టెన్ కాలేక పోయిన ఐనయ ఏడుస్తూ కూర్చొంది. దానితో గెలిచిన  రేవంత్ ఆమె దగ్గరకెళ్ళి ఓదారుస్తాడు..’నేను నిన్ను మాత్రమే కావాలని టార్గెట్ చెయ్యలేదు..నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీహాన్ ని కూడా ఫైనల్ లో ఆడించాను, ఇదంతా ఆటలో భాగమే అని తెలుసుకో అన్నాడు. అలాగే వచ్చే వారం నిన్ను ఖచ్చితంగా కెప్టెన్ చేయటం కోసం సాయం చేస్తాను అని చెప్పాడు. ఇక ఇనయా ఏడుస్తూనే నన్ను ఒంటరిగా వదిలేయండి అని అనడంతో రోహిత్ వెళ్లి పోయాడు. ఇక ఇచ్చిన మాట ప్రకారం రోహిత్ ఆమెను కెప్టెన్ చేస్తాడేమో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news