అనసూయ – సుశాంక్ భరద్వాజ్ ల లవ్ స్టోరీ తెలిస్తే షాక్..!

-

బుల్లితెర గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు యాంకర్ గా తన కెరీర్ను కొనసాగిస్తూనే మరొకవైపు గ్లామర్ బ్యూటీగా సోషల్ మీడియాలో మరింత పాపులారిటీని సంపాదించుకుంటుంది. అంతేకాదు పలు సినిమాలలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సాధారణంగా అనసూయ సినీ కెరియర్ గురించి అందరికీ తెలుసు కానీ ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం చాలా మందికి తెలియదనే చెప్పాలి. ముఖ్యంగా ఆమె సుశాంక్ భరద్వాజ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే .అయితే వీరి లవ్ స్టోరీ ఎంతమందికి తెలుసు అనేది ఇప్పుడు చూద్దాం…

నిజానికి వీరిద్దరికి ఇంటర్ సెకండియర్ లో ఎన్సీసీ క్యాంపులో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానంటూ అనసూయకు ప్రపోజ్ చేశారు భరద్వాజ్. అప్పుడు ఓకే చెప్పని అనసూయ ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఆయనను బాగా తిప్పించుకొని. చివరికి భరద్వాజ్ ప్రేమను అంగీకరించింది.. అలా 9 ఏళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ 2010లో వివాహం చేసుకొని పెళ్లితో శుభం కార్డు పలికారు. వీరి వివాహానికి కుటుంబ పెద్దలు అంగీకరించకపోయినా చివరికి పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు ఈ జంట. ఇక వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.

ఇక ప్రస్తుతం జబర్దస్త్ వంటి బుల్లితెర కార్యక్రమాలకు అనసూయ దూరమైనప్పటికీ సినిమాలలో బిజీగా మారిపోయింది. ప్రత్యేకమైన పాత్రలు ఎంచుకుంటూ స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో కూడా నటిస్తోంది. అలాగే మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటుంది అనసూయ. మొత్తానికి అయితే అనసూయ అటు వైవాహిక జీవితంలోనూ.. ఇటు కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్నదని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news