ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోల రెమ్యునరేషన్స్ విపరీతంగా పెరిగాయి. ప్రభాస్, బన్నీ, మహేశ్, రామ్ చరణ్ హీరోల సినిమాలు హిట్టయితే అవలీలగా రూ.200 కోట్లు వసూలు చేస్తున్నాయి. ఇక రాజ మౌళి సినిమాలు అయితే మినిమం వెయ్యి కోట్లు. దానితో సినిమా బడ్జెట్లు పెరుగుతున్నాయి. పారితోషికాలకు రెక్కలొస్తున్నాయి. ఇది వరకు తెలుగు సినిమా బడ్జెట్ రూ.100 కోట్లంటే అంతా ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు కొంతమంది హీరోలు రెమ్యునరేషన్ వంద కోట్లు కూడా డిమాండ్ చేస్తున్నారు.
ప్రభాస్ పారితోషికం ఎప్పుడో వంద కోట్లు దాటేసింది. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఈ అంకెకు దరిదాపుల్లోనే ఉన్నారు.టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో మహేష్ ఒకరు. నిన్నా మొన్నటి వరకూ ఆయన పారితోషికం రూ.50 కోట్లే. సర్కారు వారి పాట కోసం రూ.55 కోట్లు అందుకొన్నారని టాక్. ఇప్పుడు త్రివిక్రమ్ రూ.75 కోట్లు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ సైతం ఈ సినిమాకి రూ.25 కోట్ల పారితోషికం అందుకొంటున్నారని తెలుస్తోంది. అంటే.. హీరో, దర్శకుల పారితోషికాలు కలిపితే వంద కోట్లన్నమాట.ఇక మిగిలిన బడ్జెట్ ను నటీ నటులకు , షూటింగ్ కోసం పెట్టుకుంటున్నారు.ఇలా సినిమా బడ్జెట్ లో చాలా భాగం హీరో, దర్శకుల కే పోతుంది. ఇలా చాలా మంది హీరోల సినిమాలలో కూడా జరుగుతోంది.