సినిమా స్టార్స్ ర్యాంకింగ్ సంచలనం..!!

-

ఐఎండీబీ ప్రకటించిన 2022 ర్యాంకింగ్స్‌లో మన తెలుగు సినిమా తరుపున ఇద్దరు  స్టార్స్ చోటు సంపాదించారు. తాజాగా ఈ సంవత్సరం IMDbలో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల ర్యాంకింగ్స్ ప్రకటించింది. దేశంలో ఆయా తారలకు ఫ్యాన్ బేస్ ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ను వెలువరించింది. ఈ రాంకింగ్స్ ప్రస్తుతం మీడియాలో సంచలనంగా మారాయి.

తెలుగు సినిమా నుండి ఆర్ఆర్ఆర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ నాలుగో స్థానంలో నిలవగా.. జూనియర్ ఎన్టీఆర్ 8వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ఆశ్చర్య కరంగా  తమిళ హీరో ధనుష్  బాలీవుడ్ హీరోల ను తలదన్ని అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్నారు.బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ రెండో స్థానంలో నిలిచింది. పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో విశేషంగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాయ్ 3వ స్థానాన్ని సాధించింది.

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. ఆరో స్థానంలో ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత 5వ స్థానంలో, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ 7వ స్థానంలో నిలిచారు.పుష్ప చిత్రంతో పాన్ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 9వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్‌ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ గా మారిన యశ్ ఈ జాబితా లో పదో స్థానం దక్కింది. విచిత్రంగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఒక్కడే ఉన్నాడు. మిగిలిన ఖాన్ లు గాని కపూర్ లు గాని ఒక్కరు కూడా లేరు.ఇక ప్రభాస్ కు కూడా స్థానం దక్కలేదు.

Read more RELATED
Recommended to you

Latest news